సాగర తీరం లో నీ అడుగులు చూస్తున్నా
నీ కోసం వెతుకుతూ అవి అనుసరిస్తున్నా
నీవెంత వేగంగా వెళ్ళినా నిను అందుకోగలను
నీ చెంత ఉన్న నా హృదయాన్ని చేరుకోగలను
super
అలా అలా అలవై రావా
ఇలా ఒడ్డున ఉన్న నను తాకిపోవా
తొలకరి చినుకుల తుంపరలా
నా మనసును పలకరించవా
నీ గాలి తాకని నా మనసు మబ్బు వర్షించే వీలుందా
నీ గలమున విరిసే పాటను కానా
నీ నవ్వు నేనై గల గల వినిపించనా
నీ మాట నేనై పెదవులను దాటనా
నీ కోసం వేచి చూస్తా ఆమనినై
నీ మనసున రాస్తా ప్రేమ కలాన్నై
నీ కోసం వస్తాలే చిరు చినుకునై
నా చంద్రమా
నీకెందుకురా ఇన్ని వేల తారకలు
ఎంచుకోలేవా ఒక చిన్ని కలువను
పంచుకోలేవా నీ ఎదలోని ప్రేమను
నా శ్వాస ఆగినా ప్రాణమే పోయినా
నీ తలపులే ఆగునా ఓ ప్రియా
నా మనసులో నీవేగా కనులలో నీ రూపేగా !
ఓ సారి నీ కనులను మూయవా
ఆ పై నీ మనసుతో చూడవా
ఇప్పుడున్నది చీకటైతే అందులో వెలుగును నేనేగా !
నా మనసు అనే వ్యధ లో చిలిపి తలపువి నువ్వు
నా లక్ష్యం అనే మజిలి లో ప్రియమైన అలుపువి నువ్వు
నా కవిత అనే ప్రయత్నం లో అద్భుతమైన మలుపువి నువ్వు
కానీ ఈ రోజే తెలిసింది నా తీయని వలపువి నువ్వని
నీ మనసు ఆలయంలో నను దేవతను చేసావు
ప్రేమ పూలతో నను పూజించావు
వలపు గంధంతో నను తడిపేశావు
తలపుల చందనంతో నను నింపేశావు
మాటల మంత్రాలతో నను జపియించావు
చివరికి నను జయించావులే ప్రేమ భక్తా
నా ప్రేమను నీకు ప్రసాదించి నిను కరునిస్తానులే ఇక
ఇది నువ్వా నేనా?
నాలో వున్న నువ్వా లేక
నీలో ఉంది నేనా?
నేనైనా నువ్వైనా
నేనంటీ నువ్వేగా
నువ్వు లేని నేను లేనుగా
నువ్వూ నేనూ ఒకటేగా
నువు రాని రేపు వద్దు
నీతో ఈ క్షణమే నాకు ముద్దు :
నీ కళ్ళు నా ప్రేమకు సంకెళ్ళు
నువ్వు చూసినప్పుడు పెరిగెను నా గుండె చప్పుడు
మనసు పాడెను చిన్నిచిన్ని ఊసులు
కలలూ ఊహలూ తెలిపే మూగ భాషలు
రేపులో నువు చేరావు
అంతలోనే
ఏడ్పించే నీడలా వచ్చి
నిన్నలా నువు మారావు
నా గుప్పెడు గుండెల్లో చప్పుడు నువ్వేలే
నా కన్నుల రెప్పల్లో తియ్యని కలవూ నువ్వేలే
నా పెదవుల అంచుల్లో ప్రతి మాట నువ్వేలే
ఓ ప్రియా నే పయనించే బాటా నువ్వేలే
నిండు పున్నమి వెన్నెల్లో ఎంత హాయిగా వుంటుందో
పసిపాప బోసి నవ్వు ఎంత నిష్కల్మషంగా వుంటుందో
నాన్న చేతిలో చేయ్యస్తే ఎంత నిర్బయంగా వుంటుందో
అమ్మ వొడి ఎంత వెచ్చగా వున్తున్డూ
నీ సాన్నిహిత్యం నాకు అంత హాయిగా వుంటుంది
ఎండల్లో వేడిమికి నువు చల్లని గిలిగింతవా?
మలి సంధ్యన నీరెండవా?
చలి చీకట్లో వెచ్చటి వెన్నెలవా?
నీ కంటి చూపులు తప్ప మరేవీ నను మురిపించలేవు
నీ నోటి మాటలు తప్ప మరేవీ నను కరిగించలేవు
నీ తోటి నడకలు తప్ప మరేవీ నన్నంతగా మైమరిపించలేవు
నిన్నంతగా ప్రేమించే నా అంతమైనా నిన్ను కదిలిస్తుందా?
వర్షించే కనుపాపల జలపాతాలని చేతులతూ ఒడిసిపట్టావు
నీ హృదయపు చెరువులోన ఆ నీటిని దాచిపెట్టావు
నా ప్రేమ పొలానికి అందిచ్చి పెంచావు
నిను చేరని వేళ నేను నిశినౌతా
నిశి చీల్చే వేకువ నువు కావా
నిను చూసిన వేళ నేను విరివాననౌతా
విరివానలో ముత్యపు చినుకువుకవా
నీ గుండెల్లో తలదాచుకుంటే నన్నెవరూ ఏమీ చేయలేరన్న ఓ ధీమా
నీ మాటలు వింటుంటే గర్జించే మేఘం నను లాలించిన ఓ ఆలాపన
నీ చూపే చాలు నవ వసంతాలు ముంగిట కురిసెను లే ప్రియతమా
మనసుకు మాటలొచ్చె
ఊహకు ఊపిరొచ్చే
ప్రేమకు రెక్కలొచ్చె
లోలో ఏదో కలవరమూ
తెలియని ఏదో ఆనందమూ
కలలో కూడా సంతోషమూ
కాని ఓ ప్రియా నువ్వు లేనపుడు
క్షణమొక దినమూ , దినమొక యుగమూ !!
ఏమిటా అని తలెత్తి చూశాను
అప్పుడు తెలిసింది నువ్వు నవ్వావని
నీవు వానైతే నే భూమినౌతా
నే ఎదురుచూస్తా నువ్వు నన్ను తడిపే దాక
నీవు గాలివైతే నేను చెట్టుకు తీగనౌతా
నీవెటు వెళ్తే నేనూ అటు వస్తా
నీవు హేమంతానివైతే నే మంచునౌతా
నీ చిరుచూపుకే నే కరిగిపోతా
నీవు మనసువైతే నే ప్రేమనౌతా
నీ వెంటే ఉంటా లే కడదాకా!!
నా కంటి వెలుగు లోన నీ చూపు రేఖలు
నా మనసు నది లోన నీ ఊహలు పరవళ్ళు
నా కవిత ముగ్గులోన నీ నవ్వు రంగులు
నీ మాట కోసం ఎదురు చూస్తాలే జన్మజన్మలు
No comments yet.
Leave a Reply
-
Recent
-
Links
-
Archives
- April 2010 (1)
-
Categories
-
RSS
Entries RSS
Comments RSS